వకీల్ సాబ్ ఫ్లాప్ మూవీ.. ఎక్కడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పవన్ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడని ఆయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లు రాబట్టడంతో ఈ సినిమా ఎంత లాభాలను గడించిందా అనే లెక్కలు వేసే పనిలో ఉన్నారు సినీ క్రిటిక్స్.

అయితే వకీల్ సాబ్ చిత్రం ఒకచోట ఫ్లాప్ మూవీగా నిలిచిందంటే మీరు నమ్ముతారా.. కానీ ఇది నిజం. ఓవర్సీస్‌లో పవన్ కళ్యాణ్‌కు అదిరిపోయే ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ పవన్ సినిమాలు నెలకొల్పిన రికార్డులే దీనికి ఉదాహరణగా చెప్పాలి. అయితే వకీల్ సాబ్ చిత్రం అక్కడ 1 మిలియన్ డాలర్‌కు పైగా బిజినెస్ చేసింది. కానీ సినిమాకు మాత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఇప్పటివరకు ఓవర్సీస్‌లో కేవలం 7 లక్షల 50 వేల డాలర్లు మాత్రమే వసూళ్లు సాధించింది. దీంతో ఈ సినిమా అక్కడ టోటల్ రన్‌లో 1 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి వెళ్లడం కష్టమే అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.

ఏదేమైనా పవన్ మూడేళ్ల తరువాత వెండితెరపై కనిపించడంతో, వకీల్ సాబ్ అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా ఓవర్సీస్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఫ్లాప్ మూవీగా నిలుస్తుండటంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు తలలు పట్టుకుంటున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే.