లైగర్ బ్లాక్ బస్టర్ అంటున్న విజయ్ దేవరకొండ

లైగర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు హీరో విజయ్ దేవరకొండ. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ .. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ కీల‌క పాత్ర‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా గా పలు భాషల్లో ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

చార్మీ పూరితో కలిసి బాలీవుడ్ మేకర్స్ కరణ్ జోహార్ హీరూ జోహార్ అపూర్వ మోహతా ధర్మా ప్రొడక్షన్స్ పై పూరి కనెక్ట్స్ తో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా టీజర్ , మేకింగ్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేస్తుండగా..మరోపక్క వరుస ఇంటర్వూస్ లలో విజయ్ దేవరకొండ సినిమా కు సంబదించిన అనేక విశేషాలు తెలుపుతూ అంచనాలు పెంచేస్తున్నాడు.

తాజాగా విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లైగర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. లైగర్ సినిమా బ్లాక్ బస్టర్ అని అన్నారు విజయ్. తనకు సినిమా రిజల్ట్ ముందే తెలిసిపోతుందని. గతంలో అర్జున్ రెడ్డి టైం లో కూడా ఇలానే బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పా అది జరిగింది. ఇప్పుడు లైగర్ బ్లాక్ బస్టర్ అని డిక్లేర్ చేస్తున్నా అని విజయ్ అన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.