600 మంది ఎస్ బి ఐ ఉద్యోగులకు కరోనా

ఎస్ బి ఐ సీజీఎం ఓపీ మిశ్రా వెల్లడి

covid positive cases in SBI
covid positive cases in SBI

Hyderabad: రాష్ట్రంలో 600 మంది ఎస్ బి ఐ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఎస్ బి ఐ సీజీఎం ఓపీ మిశ్రా ప్రకటించారు. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు ఉన్న ఉద్యోగులే కొవిడ్‌ బారిన పడుతున్నారని, . గురువారం నుంచి ఏప్రిల్‌ 30 వరకు సగం మంది ఉద్యోగులే బ్యాంకుల్లో విధులు నిర్వర్తిస్తారని ఆయన చెప్పారు. కోఠి , సికింద్రాబాద్‌ ఎస్బీఐ కార్యాలయాల్లో ఉద్యోగుల కోసం ప్రత్యేక కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఓపీ మిశ్రా తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/rajasthan-is-a-marvelous-victory/