బాలయ్య సినిమాకు భజన ఎందుకు లేదు?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘అఖండ’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్‌ను చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేశారు.

కాగా ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఈ టీజర్‌లో బాలయ్య అదిరిపోయే లుక్‌లో కనిపించడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ టీజర్‌కు కూడా ప్రేక్షకుల నుండి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తుండటంతో ఇది ఏకంగా 31 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుంది. అయితే ఈ టీజర్ సాధిస్తున్న రికార్డును చిత్ర యూనిట్ ఎందుకు మీడియాలో ప్రచారం చేయడం లేదని నందమూరి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మిగతా చిత్రాలు కొద్దిపాటి రికార్డులు క్రియేట్ చేస్తే మీడియా ఛానల్స్‌లో భజన చేస్తుంటారు. అలాంటిది బాలయ్య టైటిల్ టీజర్‌కు ఈ రేంజ్‌లో ఆదరణ లభిస్తున్నా, ఎందుకు మీడియాలో చూపించడం లేదని వారు వాపోతున్నారు.

మొత్తానికి అఖండ చిత్రంపై ఉన్న అంచనాలను టైటిల్ టీజర్ అమాంతం ఏ రేంజ్‌కు తీసుకెళ్లిందో ఈ వ్యూస్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు. బోయపాటి-బాలయ్య కాంబోలో వస్తున్న మూడో చిత్రం ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడుతుందని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా ఈ సినిమాతో బాలయ్య ‘అఖండ’మైన విజయాన్ని అందుకుంటాడో లేదో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.