పిఠాపురంలో వైష్ణవ్ తేజ్ జోరుగా ప్రచారం

పిఠాపురంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈసారి పిఠాపురం నుండి జనసేన ధినేత పవన్ కళ్యాణ్ బరిలోకి దిగిన సంగతి తెలిసందే. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన ఓడిపోయిన పవన్ కళ్యాణ్..ఈసారి పిఠాపురం బరిలో నిల్చున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా..పవన్ గెలుపు కోసం జనసేన శ్రేణులు తీవ్రగా కష్టపడుతున్నారు.

ఇప్పటికే పలుమార్లు పవన్ నియోజకవర్గం లో పర్యటించగా..ఇప్పుడు మెగా హీరోలు , మెగా ఫ్యామిలీ సైతం రంగంలోకి దిగింది. ఇప్పటికే వరుణ్ తేజ్ పర్యటించగా ..నిన్నటి నుండి వైష్ణవ్ తేజ్ నియోజకవర్గం లో పర్యటిస్తున్నారు. మావయ్య ను గెలిపించాలని కోరుతున్నారు. వైష్ణవ్ తో పాటు సుడిగాలి సుధీర్ , గెటప్ శ్రీను తదితరులు పర్యటిస్తున్నారు.