అమరావతి కోసం అందరూ ఉద్యమించాలి

రాజధాని ఉద్యమాన్ని మహిళలే నడిపిస్తున్నారు

nakka anandbabu
nakka anandbabu, ap minister

అమరావతి: టిడిపి నేత నక్కా ఆనంద్‌బాబు అమరావతి ప్రాంతంలోని తుళ్లూరులో రైతులు చేసున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపికి జగన్ వైరస్ పట్టుకుందని… ఇది కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనదని ఆయన అన్నారు. రాజధాని ఉద్యమాన్ని మహిళలే నడిపిస్తున్నారని… వారిని చూసి ఇతర ప్రాంతాల వారు సిగ్గు తెచ్చుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా అమరావతి కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పాలకులు తప్పులు చేస్తున్నప్పుడు మేధావులు స్పందించాలని కోరారు. మేధావుల మౌనంతో రాష్ట్రానికి కీడు జరుగుతుందని అన్నారు. అమరావతిని శ్మశానం అన్నవారు… ఇప్పటి వరకు ఎక్కడ కూర్చొని పాలించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల క్లిక్‌ కోసం చేయండి:https://www.vaartha.com/news/business/