ఏపీలో లోకల్ వార్ మొదలు

ఏపీలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. నిన్న బద్వేల్ ఉప ఎన్నిక ఫలితం వచ్చిందో లేదో..ఈరోజు నుండి పలు మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, నగర పంచాయతీలు, పలు జెడ్పిటిసి మరియు ఎంపీటీసీ స్థానాలకు సంబదించిన నామినేషన్ పక్రియ మొదలైంది.

రాష్ట్రంలో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, ఎంపీటీసీ ,జడ్పీటీసీ స్థానాలు, గ్రామ పంచాయతీల్లోని సర్పంచులు, వార్డు మెంబర్ల ఎన్నికలు.. ఈ నెల 14 నుంచి 16 వరకు జరగనున్నాయి. దానికి సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు నోటిఫికేషన్​ విడుదల కానుంది. 498 పంచాయతీల్లోని 69 సర్పంచ్, 533 వార్డు పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. వివిధ కారణాలతో ఆగిన, ఖాళీ అయిన 187 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.

ఈ నెల 14వ తేదీన పంచాయతీ, 15వ తేదీన మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికలు అలాగే 16వ తేదీన ఎంపీటీసీ మరియు జెడ్పిటిసి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. ఈ ఏడాది అక్టోబర్ 11వ తేదీ నాటి తాజా ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలను నిర్వహించాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అటు ఆన్ లైన్లో నామినేషన్లు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి టీడీపీ వినతి ఇచ్చింది.