దేశవ్యాప్తంగా 3,006 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ

కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్

Harsh Vardhan
Harsh Vardhan

New Delhi: ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆరంభం కోబోతున్నది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ కరోనా మహమ్మారి అంతానికి ఇది ఆరంభం అంటూ వ్యాఖ్యానించారు. 

దేశవ్యాప్తంగా 3,006 కేంద్రాల్లో పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. టీకా పంపిణీ ప్రక్రియలో తలెత్తే సందేహాల నివృత్తి కోసం 24 గంటలూ అందుబాటులో ఉండేలా 1075 టోల్‌ ఫ్రీ నంబరును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/