బిజెపి కొత్త డ్రామా ఆడుతుందని వి హనుమంతరావు ఫైర్

Congress Leader V Hanumantha Rao
Congress Leader V Hanumantha Rao

కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు బిజెపి తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయుధ పోరాటంలో మేము తప్ప ఎవరూ చేయలేనట్టు బిజెపి కొత్త డ్రామా ఆడుతుందని మండిపడ్డారు. సాయిధ పోరాటంలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ఆర్య సమాజ్ లు మాత్రమే ఉన్నాయన్నారు. బిజెపి వాళ్లు ఎక్కడపడితే అక్కడ సర్దార్ పటేల్ బొమ్మలు పెడుతున్నారని మండిపడ్డారు.

సర్దార్ పటేల్ ఎవరి ప్రభుత్వంలో హోం మంత్రిగా ఉన్నాడు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో హోం మంత్రిగా ఉన్నారు. దానిని కూడా హైజాక్ చేస్తారా ? అంటూ దుయ్యబట్టారు. దేశంలో బిజెపి సర్కార్ ఏది వదిలిపెట్టడం లేదని. ఆఖరికి పాల మీద కూడా జీఎస్టీ వేశారని VH ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ధరలు, జీఎస్టీ పై ప్రజల దృష్టిని మళ్లించడానికి బిజెపి కొత్త డ్రామా ఆడుతోందని ఆరోపించారు. బిజెపి పార్టీలో ఎంతమంది అవినీతిపరులు ఉన్నారు? ఎంతమందిని జైలుకు పంపారు ? అని ప్రశ్నించారు.