తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దగ్గుబాటి ఫ్యామిలీ

గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దగ్గుపాటి ఫ్యామిలీ సభ్యులు దర్శించుకున్నారు. సురేష్ బాబు , రానా అండ్ తన భార్య , తమ్ముడు అభిరాం లు స్వామి వారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వస్తుండగా.. ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఫొటోగ్రాఫర్స్, కెమెరా వాళ్లకు కుటుంబసభ్యులతో కలిసి రానా పోజులు ఇచ్చారు.

ఉదయం నైవేద్య విరామ సమయంలో వీరంతా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు ఆశీర్వచనాలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వస్తుండగా.. ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఫొటోగ్రాఫర్స్, కెమెరా వాళ్లకు కుటుంబసభ్యులతో కలిసి రానా పోజులు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు సెల్ తీసుకుని రానా దగ్గరకు వచ్చాడు. సెల్ఫీ ఇవ్వాలని రానా మొఖం దగ్గర ఫోన్ పెట్టాడు. దీంతో వెంటనే రానా అతని ఫోన్ తీసుకుని.. ‘గుళ్లో ఇలా చేయకూడదమ్మా.. తప్పు..’ అని అన్నాడు. అనంతరం ఆ ఫోన్‌ను అతనికే తిరిగి ఇచ్చేసి బయటకు వచ్చేశారు. ఆ అభిమాని ఫోన్ తీసుకుని.. నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.