జ‌నాభా నియంత్ర‌ణ కోసం కొత్త చ‌ట్టాన్నితీసుకురానున్నఉత్త‌ర‌ప్ర‌దేశ్

ఇద్ద‌రి క‌న్నా ఎక్కువ పిల్ల‌ల్ని కంటే.. ప్ర‌భుత్వ ఉద్యోగానికి అన‌ర్హులు..ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం జ‌నాభా నియంత్ర‌ణ కోసం కొత్త చ‌ట్టాన్ని తీసుకురానున్న‌ది. దీని కోసం ఓ ముసాయిదాను త‌యారు చేసింది. ఇద్ద‌రి క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో పిల్లలు క‌న్న‌వారు ప్ర‌భుత్వ ఉద్యోగానికి అర్హ‌త కోల్పోనున్నారు. అలాంటి త‌ల్లితండ్రుల‌కు ప్ర‌భుత్వ స‌బ్సిడీ కూడా ఉండ‌దు. ప్ర‌భుత్వం చేప‌ట్టే ఎటువంటి సంక్షేమ సౌకర్యం కూడా అంద‌దు. ప్ర‌భుత్వ ఉద్యోగానికి ద‌ర‌ఖాస్తు చేసుకునే వీలు ఇవ్వ‌రు. అంతేకాదు స్థానిక ఎన్నిక‌ల్లోనూ వాళ్లు పోటీప‌డే ఛాన్సు లేదు. ఇలాంటి ప్ర‌తిపాద‌న‌ల‌తో ముసాయిదాను త‌యారు చేశారు. యూపీ జ‌నాభా బిల్లు 2021పై ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేసేందుకు జూలై 19వ తేదీ వ‌ర‌కు స‌మ‌యాన్ని కేటాయించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/