చరణ్ ఆ రెండు సినిమాలను 50 సార్లు చూశాడట..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ఆర్ఆర్ఆర్ ముందు వరకు కూడా చరణ్ కు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే విపరీతమైన క్రేజ్ ఉండేది..కానీ ఆర్ఆర్ఆర్ తర్వాత వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఏర్పడింది. హాలీవుడ్ మీడియా సైతం చరణ్ ఫై ఫోకస్ చేస్తుంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ కావడంతో రామ్ చరణ్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, ప్రపంచ స్థాయి పాపులారిటీ ఉన్న యూట్యూబర్స్ రామ్ చరణ్ తో ప్రత్యేక ఇంటర్వ్యూలు చేసేందుకు పోటీ పడుతున్నారు.

తాజాగా లెటర్ బాక్స్డ్ అనే యూట్యూబ్ ఛానల్ కి రామ్ చరణ్ ఇంటర్వ్యూ ఇచ్చి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ముఖ్యముగా తనకు ఇష్టమైన నటులను , సినిమాల గురించి తెలుపడం జరిగింది. గతంలో ఒక ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ స్టార్స్ జూలియా రాబర్ట్ ,క్యాథరిన్ జేట జోన్స్ అని తెలిపిన చరణ్.. ఇప్పుడు తన ఫేవరెట్ సినిమాల గురించి మాట్లాడుతూ.. “ది నోట్ బుక్ ,టెర్మినేటర్ 2” మొదటి రెండు స్థానాలలో ఉంటాయని తెలిపారు. అవి డిస్క్ లో ఉన్నప్పుడు ఒక్కో సినిమా 50 సార్ల కంటే పైగానే చూశానని , అందులో ప్రతి సీను కూడా ఏదో విధంగా అట్రాక్ట్ చేస్తుంది.. ఎమోషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకొచ్చాడు.

ఇక ప్రస్తుతం చరణ్..శంకర్ డైరెక్షన్లో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతమేర జరిగింది. ఈ మూవీ లో చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా..ఆయనకు జోడిగా అంజలి , కియారా అద్వానీ నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.