మున్సిపల్‌ ఎన్నికల్లో డబ్బుతో గెలిచామనడం సరికాదు

ఓట్లేసిన ప్రజలను, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, లక్ష్మణ్‌ అవమానిస్తున్నారు

K. T. Rama Rao
K. T. Rama Rao

హైదరాబాద్‌: బిజెపి ఒక ట్రెండు మున్సిపాలిటీలు గెలిచి ఎగిరెగిరి పడుతున్నారని టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కెటిఆర్‌ అన్నారు. బిజెపిలకు 1200 వార్డుల్లో అభ్యర్థులే లేరన్నారు. 92 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలిచామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో డబ్బుతో గెలిచామనడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఓట్లేసిన ప్రజలను ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అనుమానిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడితే ఈవీఎంలే కారణమని లొల్లి చేశారు. మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల ఫలితాలపై ఏం చెబుతారా? అని కెటిఆర్‌ ప్రశ్నించారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి అన్ని వ్యవస్థలపై నమ్మకం పోయింది..ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మడం లేదు. ఉత్తమ్‌ ఇంట్లో కూర్చోవడం బెటర్‌ అని కెటిఆర్‌ విమర్శించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/