14వ రోజు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

పెట్రోలుపై 51 పైసలు, డీజిల్ పై 61 పైసల ధర పెరుగుదల

Reduced petrol prices
petrol

న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు, 14వ రోజు కూడా పెరిగాయి. ఈ ఉదయం లీటరు పెట్రోలు ధరను 51 పైసలు, డీజిల్ ధరను 61 పైసల మేరకు పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వెల్లడించాయి. దీంతో న్యూఢిల్లీలో పెట్రోలు రూ. 78.88, డీజిల్ రూ.77.67కు చేరగా, ముంబయిలో పెట్రోలు రూ. 85.70, డీజిల్ రూ.75.11కు, చెన్నైలో పెట్రోలు ధర రూ. 82.27, డీజిల్ రూ.75.29కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, హైదరాబాద్ లో పెట్రోలు రూ. 81.88, డీజిల్ రూ.75.91కు, అమరావతిలో పెట్రోలు రూ. 82.27, డీజిల్ రూ.76.30కు పెరిగింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/