అమెరికా ఉపాధ్యక్షుడి సహాయకురాలికి కరోనా

వైట్‌హౌస్‌లో రెండో కరోనా కేసు నమోదు

corona virus
corona virus

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షుడి సహాయకురాలికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో వైట్‌హౌస్‌ అప్రమత్తమైంది. అమెరికాలోని కరోనా పరిస్థితులను సమీక్షిస్తున్న ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ప్రెస్‌ సెక్రటరీగా పనిచేస్తున్న కేటీ మిల్లర్‌కు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. కరోనా సోకిన కేటీ మిల్లర్‌కు గతంలో కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చిందని, ఇప్పుడు పరీక్షలు జరపగా కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైట్‌హౌస్‌ అధికారులు తెలిపారు. కేటీ మిల్లర్‌ కరోనా వైరస్‌ పై జరిగిన పలు కీలక సమావేశాల్లో పాల్గన్నారని అన్నారు. మరో వైపు వైట్‌హౌస్‌లో పనిచేసిన యూఎస్‌ మిలటరీకి చెందిన ఒక అధికారికి కరోనా సోకింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఉపాధ్యక్షుడు పెన్స్‌ లకు కరోనా పరీక్ష చేయగా వారికి నెగిటివ్‌ వచ్చింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/