అమెరికాలో కాల్పులు-ముగ్గురు మృతి

ఇల్లినాయిస్‌లోని రాక్‌ఫోర్డ్‌లోని డాన్‌ కార్టర్‌ లేన్‌లో దుశ్చర్య

Illinois shooting- 3 killed
Illinois shooting- 3 killed

Washinton: అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది.  గుర్తు తెలియని వ్యక్తి విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో  ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఇల్లినాయిస్‌లోని రాక్‌ఫోర్డ్‌లోని డాన్‌ కార్టర్‌ లేన్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు వివరించారు.

నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/