ఇవాంక సహాయకురాలికి కరోనా పాజిటివ్
వైట్‌హౌస్‌లో మూడుకు చేరిన కరోనా కేసులు

వాషింగ్టన్: అమెరికా అధక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక వ్యక్తిగత సహాయకురాలికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో వైట్‌హౌస్‌లో కరోనా కేసుల సంఖ్య మూడుకు చేరింది. కాగా గత కొద్ది రోజులుగా ఆమె ఇవాంక దగ్గరకు రాకపోవడంతో ఎలాంటి ప్రపమాదం లేదని అధికారులు స్పష్టం చేశారు. లాక్డౌన్ ఆంక్షల కారణంగా ఇవాంకా సహాయకురాలు గత రెండు నెలలుగా ఫోన్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనీ.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆమెలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. కాగా ఇప్పటికే ఇవాంక, ఆమె భర్త జేర్డ్ కుష్నర్కు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ ఫలితం వచ్చినట్టు పేర్కొంది.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/