భారత ప్రజలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

అమెరికా, భారత్ సహజ భాగస్వాములు..జో బైడెన్

US President Joe Biden wishes India on 75th anniversary of independence

వాషింగ్టన్‌ః ఈరోజు భారత్‌ మొత్తం 76వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో, భారత ప్రజలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన తన సందేశం వెలువరించారు. మహాత్మా గాంధీ ప్రబోధించిన సత్యం, అహింస సిద్ధాంతాన్ని గుర్తుచేసుకున్నారు. అమెరికా, భారత్ సహజ భాగస్వాములు అని పేర్కొన్నారు. సవాళ్ల పరిష్కారంలో అమెరికా, భారత్ పరస్పరం సహకరించుకుంటాయి అని స్పష్టం చేశారు.

మరోవైపు భారత్, పాకిస్థాన్ దేశాల నడుమ అంతర్జాతీయ సరిహద్దు వద్ద కూడా స్వాతంత్ర్య వేడుకలు జరిగాయి. భారత్, పాక్ దళాలు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నాయి. సుహృద్భావపూరిత వాతావరణంలో ఉభయ దేశాల సైనికులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పాకిస్థాన్ ప్రతి ఏడాది ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/