ఆ ట్యాబ్లెట్లు ప్రతి రోజు వేసుకుంటున్నా

హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు పనితనం గురించి చాలా మంది తెలిపారు.

donald trump
donald trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ కరనా వైరస్‌ సోకకుండా ముందు జాత్రగత్తగా ప్రతి రోజు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నట్టు తెలిపారు. అయితే, ఈ మందుల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఆ తర్వాత జరిగిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ మందుల ఉపయోగంపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) హెచ్చరికలు కూడా జారీ చేసింది. కరోనా రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు ఇస్తే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది.

అయినప్పటికీ తాను ఈ మాత్రలను గత వారం రోజులుగా రోజుకొకటి చొప్పున వేసుకుంటున్నట్టు ట్రంప్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తనకు కరోనా పరీక్షలు చేసిన వైట్ హౌస్ వైద్యుడిని హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్ల ఉపయోగం గురించి అడిగితే మీకు నచ్చితే మంచిదిగ అని సమాధానం ఇచ్చారని, అందుకే వాటిని ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు పనితనం గురించి తనకు చాలా మంది చెప్పారనీ, మంచి ఫలితాలు వచ్చినట్టు కూడా చెప్పారనీ, అందుకే ముందు జాగ్రత్తగా తీసుకుంటున్నానని ట్రంప్ చెప్పారు. అలాగే జింక్ ట్యాబ్లెట్, అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్ కూడా తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. కాగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు కరోనాకు విరుగుడంటూ అప్పట్లో ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు. భారతదేశం నుంచి పెద్ద ఎత్తున ఈ ట్యాబ్లెట్లను దిగుమతి చేసుకున్నారు కూడా.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/