ఐరాస భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు ఇస్తాం: మోడీతో భేటీలో బైడెన్

US President Biden backs India for permanent seat at UN security-council

న్యూఢిల్లీః జీ20 కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు తొలిసారి భారత్‌ వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ గత రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం ఆయన లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని మోడీ నివాసానికి చేరుకున్నారు. అక్కడ మోడీతో ద్వైపాక్షిక భేటీలో పాల్గొన్నారు బైడెన్. దాదాపు 50 నిమిషాలసేపు సాగిన భేటీ అనంతరం నేతల సంయుక్త ప్రకటన విడుదలైంది.

2028-29లో ఐరాస భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు ఇస్తామని బైడెన్‌ ప్రకటించారు. అంతే కాకుండా ఉమ్మడి లక్ష్యాల పురోగతిక శిఖరాగ్ర సదస్సు ఫలితాలు ఆలంబనగా నిలుస్తాయని మోడీ, బైడెన్‌ ఆశాభావం వెలిబుచ్చారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, సమ్మిళిత, దాపరిక రహిత కార్యకలాపాల్లో క్వాడ్‌ కూటమికి ఉండే ప్రాధాన్యాన్ని వారు గుర్తు చేశారు.

జీ20కి భారత్‌ సారథ్యం, అణు ఇంధన రంగ సహకారం, 6G, కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతలు, అంతర్జాతీయ బ్యాంకుల పునర్నిర్మాణం వంటి అంశాలు.. వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిపారు. 2024లో భారత్‌ ఆతిథ్యం ఇవ్వబోయే క్వాడ్‌ సదస్సుకు బైడెన్‌ను మోడీ ఆహ్వానించారు