దేశంలో కొత్తగా 1,150 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,365

న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో 4.6 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 1,150 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 1,194 మంది కరోనా నుంచి కోలుకోగా 83 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల్లో 75 కేరళలోనే సంభవించడం గమనార్హం.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,365కి తగ్గాయి. క్రియాశీల రేటు 0.03 శాతానికి తగ్గింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,21,656కి చేరింది. ఇప్పటి వరకు 4,25,01,196 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. నిన్నటి వరకు 185 కోట్లకు పైగా కరోనా డోసులు వేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న ఒక్క రోజే 14.7 లక్షల మంది టీకా వేయించుకున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/