భారతీయురాలికి అమెరికా అధ్యక్ష పదవి?

‘వార్తల్లోని వ్యక్తి’ ప్రతి సోమవారం

Kamala Harris-
Kamala Harris-


అమెరికాకు స్వాతంత్య్రం వచ్చి (1776 జులై 4) ఇప్పటికి 254 సంవత్సరాలు. ఈ రెండున్నర శతాబ్దాలలో ఇంతవరకు ఎన్నికల సమయంలో ఎవరి జోస్యం ఫలించలేదు!

1948లో

1948లో డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన హారీ ట్రూమన్‌కు, రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ఎడ్మండ్‌ ఒల్కాయీకి పోటీ జరిగింది. ఎన్నికలలో ఇంకా ఫలితం రాకపూర్వమే ప్రఖ్యాత అమెరికన్‌ దినపత్రిక ‘చికాగో ట్రిబ్యూన్‌ డల్కాయీ చేతిలో ట్రూమన్‌ పరాజయం అంటూ హెడ్డింగు పెట్టింది! చివరకు హెడ్డింగు తారుమారయింది.

గాడిద చేతిలో ఏనుగు పరాజయం!

అమెరికాలో రెండే రెండూ ప్రధాన పార్టీలు. గొప్ప అధ్యక్షులను దేశానికి అందించిన డెమొక్రాటిక్‌ పార్టీ గుర్తు గాడిద! రిపబ్లికన్‌ పార్టీ ఎన్నికల గుర్తు ఏనుగు గాడిద చేతిలో ఏనుగు పరాభవమేమిటి? గాడిద అంటే అమెరికన్‌లకు యిష్టమా? మన గాడిద అంటే చాలా చులకన! కోసం వస్తే కుర్రవాడిని ‘ఒరే గాడిద అంటాం! గాడిద తన్ను అంటామ్‌.

ఏనుగును తన్నిన గాడిద

అప్పటిలో చికాగో ట్రిబ్యూన్‌ పత్రిక ఏనుగును గాడిద తన్నింది అని కూడా వ్యాఖ్యానించింది. గాడిద అంటే అమెరికన్‌లకు న్యూనతాభావం లేదు కాబోలు! అలాగే అత్యంత బలీయురాలైన (రాజకీయంగా) డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి రిపబ్లికన్‌ ట్రంప్‌తో ఓడిపోయింది. నిజానికి హిల్లరీ అజేయురాలుగా కనిపించింది. కాని, రెండు సార్లూ ఓడిపోయింది!

ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షురాలుగా కమలాహారిస్‌ అనే ఇండియన్‌ సంతతికి చెందిన మహిళామణి హారిస్‌ గెలవడం ప్రపంచానికే అచ్చెరువుకలిగించింది! అన్సులకు అభేద్యమైన అమెరికాకు ఒక ఇండియన్‌ ఉపాధ్యక్షురాలా? ఎంత ఆశ్చర్యం! హిల్లరీకే దిక్కులేకుండాపోయిందే! అలాంటిది భారతీయ వనిత అమెరికా అధ్యక్షురాలు కావడమా?

వైస్‌-ప్రెసిడెంట్‌ అధికారాలు

అమెరికాలో ఉపాధ్యక్షురాలికి చాలా అధికారులున్నాయి. అమెరికా ఎగువ సభకు ఆమె అధ్యక్షురాలు. ఏ కారణం చేతనైనాఅధ్యక్షుడు ‘కొంతకాలం గైరుహాజరైతే ఉపాధ్యక్షురాలే అధ్యక్షురాలిగా వ్యవహరించాలి. పాపం శమించుగాక!

అధ్యక్షుడు ‘లేకపోతే ఉపాధ్యక్షుడే అధ్యక్షుడు. ఆరునెలల వరకు ఈ లోగా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. ఆరునెలల లోగా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాలి. అధ్యక్షునికి అస్వస్థతగా ఉంటే, ఉపాధ్యక్షుడే అధ్యక్షుడు! వీటినే మనం భారత రాజ్యాంగంలోకి తీసుకున్నాం.

  • డాక్టర్‌ తుర్లపాటి కుటుంబ రావు, (‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత)

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/