రైళ్లలో మహిళలకు భద్రత కరవు

women in train journey (File)

నేడు దేశంలో స్త్రీకి రక్షణ లేకుండాపోతోంది. అమ్మాయిలను, మహిళలను వేధించడానికి కామాంధులకు వీలుకాని చోటంటూ ఏదీ లేకుండా పోయింది. మెట్రోలు, రైళ్లలో కూడా మహిళలపై లైంగిక వేధింపులు జరిగాయన్న వార్తలు తరచుగా వస్తూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే 2017-19 మధ్యభారతీయ రైళ్లలో మగువలపై జరిగిన అఘాయిత్యాలపై ఆర్టీఐ ఓ నివేదికను సేకరించింది. ఈ రిపోర్టులో కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆ నివేదికలో రైళ్లలో మహిళలకు భద్రత కరువైందని తెలుస్తోంది. కదిలే రైళ్లలో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు చాలానే జరుగుతున్నాయని, అంతేకాకుండా వాటికి సంబంధించిన కేసులు కూడా అధిక శాతంలోనే నమోదయ్యాయని ఆర్టీఐ వెల్లడించింది. గత రెండేళ్లలో రైల్వే పరిసరాల్లో, కదులుతున్న రైళ్లలో చోటు చేసుకున్న అత్యాచారాల సంఖ్య 160 కావడం గమనార్హం.

ఇక లైంగిక వేధింపుల కేసులు అయితే ఏకంగా 1672 నమోదయ్యాయని రైల్వేశాఖ సమాచారం. వీటిలో 870 కేసులు కదులుతున్నరైళ్లలో చోటు చేసుకున్నాయి. కాగా దొంగ తనాల సంఖ్య విషయానికి వస్తే సుమారు 4718 కేసులు నమోదైనట్లు భారతీయ రైల్వే అధికారులు తెలిపారు. అటు గడి చిన మూడేళ్లలో 771 కిడ్నాపింగ్‌ కేసులు, 4718 దొంగతనా లు, 213 అటెంప్ట్‌ మర్డర్‌, 542 మర్డర్‌ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇవన్నీ కూడా రైల్వే పరిసరాల్లో, కదులుతున్న రైళ్లలోనూ చోటు చేసుకున్నాయని నివేదికలో వెల్లడైంది.

నీముచ్‌కు చెందిన ఒక కార్యకర్త చేసిన సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ప్రకారం 2017-2019లో రైల్వే ప్రాంగణంలో 136, నడుస్తున్న రైళ్లలో 29 అత్యాచారాలు జరిగాయి. మొత్తం 165. గత ఏడాది నమోదైన 44 అత్యాచారాలలో 36 రైల్వే ప్రాంగణంలో, 8 రైళ్లలో జరిగాయి. 2018లో అత్యాచారాలలో 41 రైల్వే ప్రాంగ ణంలో, 10 నడుస్తున్న రైళ్లలో జరిగాయి. అత్యాచారాలు కాకుండా మహిళలపై 1672 నేరాలు నమోదయ్యాయి.

వాటిలో రైల్వే ప్రాంగణంలో 802 కాగా రైళ్లలో 870 ఉన్నాయి. ఈ మూడేళ్లలో 771 కిడ్నాప్‌ కేసులు, 4718 దోపిడీ కేసులు, 213 హత్యాయత్నాలు రైల్వే ప్రాంగణాల్లో, రైళ్లలో 542 హత్యలు జరిగాయి. రైల్వేలపై పోలీసింగ్‌ అనేది ఒక రాష్ట్ర విషయం. నేరాల నివారణ, కేసుల నమోదు, వారి దర్యాప్తు, రైల్వే ప్రాంగణంలో, నడుస్తున్న రైళ్లలో శాంతిభద్రతల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. ఇప్పటి వరకు మహిళల భద్రతను నిర్ధారించడానికి రైల్వే చర్యలు చేపట్టింది. రైల్వేలలో మహిళల భద్రతపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రిత్వశాఖ గత నెలలో రాజ్యసభకు సమాచారం ఇచ్చింది.

దీని ప్రకారం భద్రతలో భాగంగా రోజూ వివిధ రాష్ట్రాల జిఆర్పి(ప్రభుత్వ రైల్వే పోలీసు) గుర్తించిన మార్గాలు లేదా విభాగాలలో సగటున 2,200 రైళ్లను రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ప్రతిరోజూ ఎస్కార్ట్‌ చేస్తోంది. అదనంగా 2,200 రైళ్లను ఎస్కార్ట్‌ చేస్తుంది. సెక్యూరిటీ హెల్ప్‌లైన్‌ 182ను భారతీయ రైల్వేపై కార్యాచరణలో ప్రమాదంలో ఉన్న ప్రయాణీకులకు భద్రతకు సంబంధిత సహాయం కోసం తోడ్పడుతుందని తెలిపింది.

మహిళా ప్రయాణి కుల కోసం రిజర్వు చేయబడిన కంపార్ట్‌మెంట్లలోకి మగ ప్రయాణీకులను ప్రవేశించడానికి వ్యతిరేకంగా డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారని, అంతేకాక పట్టుబడిన వ్యక్తులపై రైల్వే చట్టం 1989లోని సెక్షన్‌ 162 కింద విచారణ చేస్తారని తెలిపింది.

2018,2019 సంవత్సరాల్లో మొత్తం ,39,422, 1,14,170 మంది మగ ప్రయాణికులను మహిళా ప్రయాణికులకు కేటాయించిన కంపార్ట్‌మెంట్లలో అనధికారికంగా ప్రవేశించి నందుకు లేదా ప్రయాణించినందుకు వారిపై విచారణ జరిగిందని, లేడీస్‌ మెట్రోపాలిటన్‌ నగరాల్లో నడుస్తున్న ప్రత్యేక రైళ్లను లేడీ ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది ఎస్కార్ట్‌ చేస్తున్నారని, ప్రయా ణీకుల భద్రతను పెంచడానికి 2019 కోచ్‌లు (2019 నవంబర్‌ వరకు) 511 రైల్వే స్టేషన్లలో (2019 డిసెంబర్‌ వరకు) సిసిటివి కెమెరాలు అందించబడ్డాయని ప్రభుత్వం తెలిపింది.

ఈ చర్యలు రైల్వే అంతటా నేరాలు తగ్గడంలో ఉపయోగపడుతున్నప్పటికీ, మహిళలకి పూర్తిస్థాయిలో భద్రత కల్పించడంలో వైఫల్యం చెంద డం విచారించదగ్గ విషయం. 2019లో రైల్వే ప్రాంగణంలో, రైళ్లలో మొత్తం 55,826 నేరాలు నమోదయ్యాయి.

2017లో ఈ సంఖ్య 71,055గా ఉంది.అయితే ఈ నేరాలసంఖ్య క్రమేపీ తగ్గుతున్నప్పటికీ పూర్తిగా అరికట్టేలా ప్రభుత్వం చేయలేకపోతోం ది.కావ్ఞన ప్రభుత్వాలు మహిళల భద్రతకు సంబంధించిన తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి. మహిళా భద్రతకు పాటుపడాలి.

  • వాసిలి సురేష్‌

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/