పాకిస్థాన్ కు అమెరికా యుద్ధ విమానాలు

450 మిలియన్ డాలర్ల సైనిక సాయానికి ఆమోదం

us-decided-to-give-f16-fighter-jets-to-pakistan

వాషింగ్టన్ః పాకిస్థాన్ కు ఎఫ్-16 పోరాట విమానాలు అందించాలని అమెరికా నిర్ణయించింది. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలను కట్టడి చేయడంలో తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ అమెరికా గత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేశారు. ఉగ్రవాదంపై పోరులో పాక్ తమ భాగస్వామి కాదని కూడా ట్రంప్ తీర్మానించారు.

అయితే, జో బైడెన్ ప్రభుత్వం ఈ భావనను విడనాడినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఉగ్రవాద నిరోధక చర్యల కోసమే పాకిస్థాన్ కు ఎఫ్-16 యుద్ధ విమానాలు అందిస్తోంది. ఈ డీల్ విలువ 450 మిలియన్ డాలర్లు. విదేశీ సైనిక విక్రయానికి అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ తమకు ముఖ్య భాగస్వామి అని పాత విధానాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. అంతేకాదు, పాక్ కు తాము యుద్ధ విమానాలు అందించడం వల్ల ప్రాంతీయ భద్రత సమతౌల్యం దెబ్బతినదంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/