ఊర్వశివో రాక్షసివో ఐదు రోజుల కలెక్షన్స్

అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కలెక్షన్స్ ను రాబట్టలేకపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల్లో కేవలం రూ. 2.04 కోట్లు షేర్, రూ. 3.85 కోట్లు గ్రాస్ మాత్రమే రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 7.50 కోట్లుగా నమోదైంది.

ఇక ఐదు రోజుల్లో ఏరియా వైజ్ కలెక్షన్స్ చూస్తే..

నైజాంలో రూ. 77 లక్షలు
సీడెడ్‌లో రూ. 26 లక్షలు
ఉత్తరాంధ్రలో రూ. 30 లక్షలు
ఈస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు
వెస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు
గుంటూరులో రూ. 15 లక్షలు
కృష్ణాలో రూ. 17 లక్షలు
నెల్లూరులో రూ. 9 లక్షలతో.. రూ. 2.04 కోట్లు షేర్, రూ. 3.85 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ఏరియాల్లో కలుపుకుని ఈ సినిమాకు కేవలం రూ. 32 లక్షలే వసూలు అయ్యాయి. వీటితో కలిపి 5 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.36 కోట్లు షేర్‌, రూ. 4.50 కోట్లు గ్రాస్‌ దక్కింది.