గుజరాతీ సినీగాయకుడు కనోడియా మృతి
ప్రధాని మోడీ సంతాపం

Ahmedabad: గుజరాతీ సినీ సీనియర్ గాయకుడు మహేష్ కనోడియా (83) మృతిచెందారు. మహిళల గొంతు సహా 32 మంది గాయలకు గొంతును ఆయన అనుకరిస్తూ పాటలు పాడటం ఆయన ప్రత్యేకశైలి.
కనోడియా మృతితో గుజరాతీ సినిమా పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.. ప్రధాని మోడీ స్పందిస్తూ ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు.
లక్షలాది మంది అభిమానం చూరగొన్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, భాజపా మాజీ ఎంపి అయిన కనోడియా గుజరాత్‌లోని పఠాన్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు..
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/