`ఉప్పెన` కథాకమామీషు

A Still From Uppena

మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు.. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న `ఉప్పెన` కథాకమామీషు ఏంటో ఆ పోస్టర్లలోనే అర్థమవుతోంది.

లెక్కల మాష్టార్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకుడిగా పరిచయం అవుతున్నా జాలర్ల కథతో భారీ ప్రయోగమే చేస్తున్నాడని అర్థమవుతోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ సహా తొలి సింగిల్ మెగాభిమానుల్లోకి దూసుకెళ్లాయి.

ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన క్రితి శెట్టి కథానాయికగా నటిస్తోంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్కు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాక్స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గురువు మాండోలిన్ శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. మార్చి 2 న మొదటి సింగిల్ లిరికల్ వీడియోను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/