జనవరిలో పాయల్ రాజ్‌పుత్ ‘5Ws’ విడుదల!

పాయల్ రాజ్‌పుత్‌ను సరికొత్త కోణంలో చూపించే సినిమా

జనవరిలో పాయల్ రాజ్‌పుత్ '5Ws' విడుదల!
Payal Rajput in ‘5Ws’ Movie

పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘5Ws – who, what, when, where, why’ (5 డబ్ల్యూస్ – ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు?). సాధారణ ప్రశ్నలు, అసాధారణ సమాధానాలు… అనేది ఉపశీర్షిక.

గుణశేఖర్ దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ప్రణదీప్ ఠాకోర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కైవల్య క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి యశోద ఠాకోర్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్నాయి. జనవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు ప్రణదీప్ ఠాకోర్, యశోదా ఠాకోర్ మాట్లాడుతూ “ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా చిత్రమిది. పాయల్ రాజ్‌పుత్‌ను సరికొత్త కోణంలో చూపించే సినిమా.

నటిగా ఆమెకు పేరు తీసుకొస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/