సంతృప్తి – విలువ _ఎంత సంపాదించినా

vaartha devotional stories
om

ఎంత సంపాదించినా తృప్తి చెందని వారెందరినో మనం చూస్తూనే ఉన్నాం. వివేచన కోల్పోయిన మనసు ఇంద్రియాల సుఖం కోసం పరుగు తీస్తుంది. బాల్యంలో ఆటపాటలు, యౌవనంలో కామక్రీడలు, వృద్ధాప్యంలో రానున్న మృత్యు చింత. ఈ రీతిగా నానారీతుల చింతలతో జీవిత సత్యమేమో అవగతం చేసుకోలేకపోతున్నారు. పరమార్ధమును గురించి ఆలోచించకున్నారు. ఒక బీదవాడు అటవీ ఉత్పత్తులను సేకరించి పట్టణంలో అమ్ముకుని జీవించేవాడు.

వారంలోని ఏడు రోజులు రేయింబవళ్లూ కష్టపడినా చాలని సంపాదన,పిల్లలకు కడుపునిండా తినడానికి కావలసినంత పెట్టలేకపోతున్నానని బాధపడుతుండేవాడు. బాధాతప్త హృదయుడై అడవిలో తిరుగుతున్నప్పుడు ఒక సాధువ్ఞ ఎదురయ్యాడు. భక్తితో ఆ సాధువ్ఞకు పండ్లు, తేనె సమర్పించి నమస్కరించాడు. ఒక రోజు తన బాధలను అతనికి చెప్పుకొన్నాడు. సాధుపుంగవ్ఞడు నవ్ఞ్వతూ నీకొక ఉపాయం చెబుతాను.

కాని ఏనాడైనా నేను చెప్పిన పరిమితిని దాటనని వాగ్ధానం చేయమన్నాడు. అందుకు ఆ బీదవాడు సమ్మతించాడు. ఇక్కడి నుండి కొంత దూరంలో ఒక పాడుబడిన మందిరం మధ్యలో ఒక బావి ఉంది. బావిలోపలికి దిగితే ఒక సొరంగం కనిపిస్తుంది.ఆ సొరంగం గుండా వెళితే అక్కడ చాలా యేళ్ల క్రితం ఒక రాజు భద్రపరచిన భాండాగారం ఉంది. అపారమైన బంగారు నాణేలు, రత్నరాశులు ఉన్నాయి. నీకు కావలసినంత తీసుకో. వాటిని అమిమ నీ కుటుంబాన్ని పోషించుకో. అయితే ఒక షరతు. చీకటి పడే ముందే నీవ్ఞ బయటికి రావాలి.

మన కథానాయకుడు సంతోషంతో సాధువ్ఞ కాళ్లపైన పడినాడు. సాధువ్ఞ వెళ్లిపోయాడు. తనకు కావలసినన్ని బంగారు నాణేలను తీసుకుని వచ్చి చిన్న దుకాణం ప్రాంభించాడు. వ్యాపారం సజావ్ఞగా జరుగుతుండేది. వానాకాలంలో ఇల్ల కారుతుండేది. మంచి ఇల్లు కట్టుకునేందుకు కావలసిన ధనం తెచ్చుకున్నాడు. ఇలా కోరికలు పెరిగాయి. ఇల్లు తయారైంది. కావలసిన పరికరాలను సమకూర్చుకున్నాడు.

పిల్లలకు మంచి బట్టలు, భార్యకు పట్టుచీరలు తెచ్చుకొన్నాడు. కోరికలకు రెక్కలు వచ్చాయి. స్థితి, గతి పెరగడంతో సమాజం అతన్ని గౌరవించసాగింది. ఈ గుర్తింపుతో తృప్తి చెందక గ్రామపంచాయతీ అధ్యక్షుడయినాడు. అధికారం మత్తు పెరిగింది. అంతటితో మనిషి తృప్తి చెండదు. అది సామాన్యమానవ్ఞని నైజం. ఇతడు కూడా పెద్ద భవనం కట్టుకొన్నాడు. వాహనాలు, నౌకర్లు పెరుగుతున్నాయి. ధనవంతుల పట్టికలో మొదటిస్థానం అందుకున్నాడు. తనకు కావలసినంత ధనం తెచ్చుకొన్నాడు.

ఒకరోజు సాధువ్ఞ చెప్పిన మాటను మరచిపోయాడు. మూడు నాలుగు గోతాలతో రహస్యస్థావరంచేరాడు. నాలుగు సంచుల నిండా బంగారు నాణేలు, రత్నాలు నింపుకొన్నాడు. సంచులను భుజానికి ఎక్కించాడు. బరువ్ఞ బాగా పెరిగింది.

సూర్యుడు అస్తమించాడు. చీకటి పడుతున్నదన్న భయంతో బయటికి వస్తుండగా బరువ్ఞ మోయలేక కాళ్లు తడబడ్డాయి. కిందపడ్డాడు. బంగారు నాణేల రాశులు అతనిపై పడ్డాయి. చీకటి ఆవరించింది. నిర్జనారణ్యంలో క్రూరమృగాలు సంచరిస్తున్నాయన్న భయంతో కుమిలిపోయాడు.

సొరంగం మూత పడింది. శ్రీమంతుడైన బీదవాడు సంపదల మధ్య సమాధి అయ్యాడు. ఇది ఒక మనోజ్ఞమైన కథ. ఇంకా సంపాదించాలి అన్న కోరిక నానాటికి పెరగడంతో సుఖ సంపదలు, కీర్తి ప్రతిష్టలు అంతులేక పోతున్నాయి. ఈ రీతిగా వివేక భ్రష్టుడై మానవ్ఞడు సుఖాల కోసం పరుగుతీస్తాడు. భౌతిక సుఖాలు అమితంగా అనుభవిస్తూ వ్యక్తి తృప్తిలేక దుఃఖతప్తుడవ్ఞతాడు. చివరకు కాలగర్భంలో మట్టిలో సమాధి అవ్ఞతున్నాడు. ప్రతి ఒక్కరికి తృప్తి ఉండాలి.

-వులాపు బాలకేశవులు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/