థాయ్‌లాండ్‌లో తొలి కోవిడ్‌-19 మృతి

Thailand report first covid-19 death
Thailand report first covid-19 death

బ్యాంకాక్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్‌19 వైరస్.. థాయ్‌లాండ్‌ను కుదివేయనుందా అనే గుబులు స్థానిక ప్రజల్లో వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వల్ల అనేక మంది చనిపోతున్నారు. కాగాథాయ్‌లాండ్‌లో ఈ వైరస్ వల్ల మొట్టమొదటి మరణం సంభవించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 35 ఏళ్ల ఓ వ్యక్తికి కరోనా సోకిందని, అయితే అప్పటికే అతడికి డెంగ్యూ జ్వరం ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. వైరస్ సోకిన వెంటనే అతడు మరణించాడని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. థాయ్‌లాండ్‌లో ఇప్పటికి 42 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 30 మంది తిరిగి కోలుకున్నట్లు మరో 11 మంది పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని స్థానిక ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/