భీమ్లా నాయక్ నుండి “అంత ఇష్టం” సాంగ్ ప్రోమో రిలీజ్

భీమ్లా నాయక్ నుండి “అంత ఇష్టం” సాంగ్ ప్రోమో రిలీజ్

భీమ్లా నాయక్ నుండి మరో ప్రోమో వచ్చింది. “అంత ఇష్టం” అనే సాంగ్‌ తాలూకా ప్రోమో ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ పాటకు సంగతీ దర్శకుడు థమన్‌ అందించిన మ్యూజిక్‌ అద్భుతంగా ఉంది. ఇక ఈ ఫుల్‌ సాంగ్‌ రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పవన్ కళ్యాణ్ – రానా కలయికలో భీమ్లా నాయక్ వస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ డైరెక్షన్లో మాటల తెరకెక్కుతున్న ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై నాగ వంశీ నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో పవన్ స‌ర‌స‌న మలయాళ బ్యూటీ నిత్యామీనన్ నటిస్తుండగా.. రానాకు స‌ర‌స‌న సంయుక్త మీన‌న్ నటిస్తుంది.