నేడు విజయవాడ లో సందడి చేయబోతున్న సోనూసూద్

ప్రముఖ నటుడు..రియల్ హీరో సోనూసూద్ ..బుధువారం విజయవాడ నగరంలో సందడి చేయబోతున్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోనూసూద్.. విజయవాడ కు వస్తున్నారు. మధ్యాహ్నం 3:30 నిమిషాలకు సోనూసూద్ విజయవాడకు చేరబోతున్నట్టు సమాచారం. ఆ ఆతర్వాత సోనూ విజయవాడ లో ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మను దర్శించుకునే అవకాశం ఉంది. రాత్రి 9 గంటలకు ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనబోతారని తెలుస్తుంది.

తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటిస్తున్న సోనూసూద్.. తెలుగులో అరుంధతి చిత్రానికి ఉత్తమ ప్రతినాయకునిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు. భారతదేశంలో కరోనా వ్యాప్తి సమయంలో దేశవ్యాప్త నిర్బంధం కారణంగా వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న వారిని స్వంత ఖర్చులతో వారి ఊర్లకు పంపించడం, అలాగే ఆక్సిజన్ కొరత ఉన్నచోట్ల సిలిండర్లు సమకూర్చడం, ఉపాధి కోల్పోయిన వారికి బ్రతుకు దెరువు చూపించడం లాంటి చర్యలతో వార్తల్లో నిలువడమే కాదు రియల్ హీరో అనిపించుకున్నాడు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీ లో సోను సూద్ నటిస్తున్నాడు.