కంటెంట్ విషయంలో డైరెక్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన చిరంజీవి

కంటెంట్ ఉంటె ప్రేక్షకులు థియేటర్స్ కు ఎప్పుడు వస్తారని..ఎన్నో ఓటిటి లు , స్మార్ట్ ఫోన్ లు ఉన్నప్పటికీ ప్రేక్షకులు థియేటర్స్ లలోనే సినిమాచూసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారని..ఇటీవల విడుదలైన బింబిసార, సీత రామం, కార్తికేయ 2 చిత్రాలే ఉదాహరణ అని చిరంజీవి అన్నారు. కంటెంట్ విషయంలో డైరెక్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

జాతిర‌త్నాలు ఫేం డైరెక్ట‌ర్ అనుదీప్ కేవీ క‌థ‌నందిస్తున్న చిత్రం ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో . వంశీధ‌ర్ గౌడ్‌-ల‌క్ష్మి నారాయ‌ణ పుత్తంశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి హీరోగా డెబ్యూ ఇస్తున్నాడు. సంచితా బ‌సు ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. సెప్టెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ఆదివారం ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా చిరంజీవి హాజరయ్యారు.

ఈ సందర్భాంగా ఆయన మాట్లాడుతూ.. సక్సెస్ రేటు అప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉందని అన్నారు. సరైన కంటెంట్‌తో సినిమాలు ఇవ్వగలిగితే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అన్నారు. సినిమాలో కంటెంట్ లేకుంటే రెండో రోజే కనుమరుగైపోతుందని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో అలాంటి బాధితుల్లో తాను కూడా ఒకడిని అయ్యానని గుర్తు చేసుకున్నారు.

ప్రేక్షకులకు ఏది అవసరం అనే విషయాన్ని డైరెక్టర్లు గమనించాలని సూచించారు. డేట్స్ క్లాష్ అవుతాయని షూటింగ్స్ విషయంలో కంగారు వద్దని అన్నారు. తమపై ఎంతోమంది ఆధారపడి ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. కంటెంట్ విషయంలో డైరెక్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. అలా ఆలోచించిన రోజున ఇండస్ట్రీకి మరిన్ని హిట్స్ వస్తాయని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.