మామకు ఆలస్యంగా బర్త్ డే విషెష్ తెలిపిన మెగా కోడలు

మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన ఓ రోజు ఆలస్యంగా చిరంజీవికి బర్త్ డే విషెష్ తెలిపింది. చిరంజీవి పుట్టిన రోజు నిన్న. ఈ సందర్బంగా సోషల్ మీడియా మొత్తం మెగా విషెష్ తో మారుమోగిపోయింది. మెగా హీరోలు , అభిమానులు , సినీ ప్రముఖులు , రాజకీయ నేతలు ఇలా అన్ని రంగాలవారు చిరంజీవి కి బెస్ట్ విషెష్ ను తెలియజేసారు. అయితే ఉపాసన, శ్రీజ మాత్రం ఈరోజు విషెస్ తెలిపారు. నిన్న బర్త్ డే అయితే నేడు వారిద్దరూ పోస్టులు వేశారు. ఇలా ఆలస్యంగా పోస్టులు ఎందుకు వేయాల్సి వచ్చిందో ఉపాసన క్లారిటీ ఇచ్చింది.

సోషల్ మీడియాలో ఆలస్యంగా విషెస్ చెబుతున్నాను.. ఎందుకంటే సెలెబ్రేషన్స్‌లో మేం బిజీగా ఉన్నాం.. ఆ మెమోరీస్‌ను ఎప్పటికీ పదిలపర్చుకోవాలని అనుకున్నాను. హ్యాపీ బర్త్ డే డియరెస్ట్ మామయ్య.. అంటూ ఉపాసన చిరు ఫై ప్రేమను చూపించింది.

https://www.instagram.com/reel/ChmFIh4DKZG/?utm_source=ig_web_button_share_sheet