ఓటిటి ద్వారా దసరాకు ‘మిస్ ఇండియా’
సౌత్ అన్నిభాషలతోపాటు హిందీలోకూడ

కరోనా వ్యాప్తి ప్రభావంతో అక్టోబర్ నుంచి అయినా థియేటర్లు ఓపెన్ అవుతాయా అంటే అనుమానమే అంటున్నారు కొందరు..
అలాంటి సమయంలో వరుసగా సినిమాలను ఓటిటి ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే కీర్తి సురేష్ ‘పెంగ్విన్ సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చింది.
త్వరలో ‘మిస్ ఇండియా’ కూడ ఓటిటి ద్వారా విడుదలకు రెడీ అవుతోంది. ఒక ప్రముఖ ఓటిటి సంస్థ భారీ మొత్తానికి ఈ సినిమాను కొనుగోలు చేయటం జరిగింది.
ఈసినిమాస్ట్రీమింగ్ కోసం మంచి టైం సెట్‌చేశారు కూడ.. అక్టోబర్ మొదటి వారంలో లేదా రెండో వారంలో దసరా పండుగ కానుకగా ఈసినిమాను ప్రీమియర్ చేయాలని నిర్ణయించారని తెలిసింది..
ఈసినిమాతో నరేంద్ర నాధ్ దర్శకుడిగా మారగా మహేష్ కోనేరు నిర్మించారు..
‘మిస్ ఇండియా’ సినిమాను సౌత్‌లో అన్ని భాషలతోపాటు హిందీలో కూడ డబ్ చేయబోతున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/