యూపీలో విషాదం.. ఇంట్లో మంటలు చెలరేగి ఐదుగురు సజీవ దహనం

యూపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. షాపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం తో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం అయ్యారు. యూపీలోని మౌ జిల్లా కోపగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

సజీవదహనమైన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఓ మహిళ, పురుషుడు ఉండగా మిగతా ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇంట్లోని స్టవ్ నుంచి మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. బాధితులు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.