తెలంగాణ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసిన విద్యాశాఖ

కరోనా మహమ్మారి కారణంగా ఏడాదిన్నర మూతపడిన పాఠశాలలు సెప్టెంబర్‌ 1 వ తేదీ నుంచి పున: ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో రాష్ట్ర విద్యాశాఖ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఈ అకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఈ ఏడాది మొత్తం 213 పని దినాలు ఉండనున్నాయి. ఇక ఏప్రిల్ 23 వ తేదీ 2022 చివరి పని దినం గా తెలిపారు.

దసరా సెలవులు అక్టోబర్ 6 నుండి 17 వరకు (12 రోజులు) , డిసెంబర్ 22 నుండి 28 డిసెంబర్ వరకు (7 రోజులు) మిషనరీ స్కూల్స్ కి క్రిస్మస్ సెలవులు, జనవరి 11 నుండి 16 వరకు (7 రోజులు) మిషనరీ స్కూల్స్ మినహా సంక్రాంతి సెలవులు ఉండనున్నట్లు తెలిపారు. మార్చి, ఏప్రిల్ లో పదవ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 24 నుండి జూన్ 12 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి.