ఆర్మీ హెలికాప్టర్‌ కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు..ఏంజరిగిందనేది బయటడింది.

ఆర్మీ హెలికాప్టర్‌ కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు..ఏంజరిగిందనేది బయటడింది.

భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్‌ బుధవారం కోయంబత్తూరులోని కూనూర్ సమీపంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి కొద్దీ క్షణాల ముందు ఏంజరిగిదనేది బయటపడింది. హెలికాప్టర్‌ భారీ శబ్దంతో చాల కింది నుండి వెళ్తుండడం తో కొంతమంది హెలికాప్టర్‌ ను వీడియో తీశారు. భారీ పొగమంచు కారణంగా చెట్టుకు హెలికాప్టర్‌ తగలడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అక్కడి స్థానికులు చెపుతున్నారు. హెలికాప్టర్‌ కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు జరిగిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. గత మూడు రోజులుగా నీలగిరి ప్రాంతంలో భారీ పొగమంచు కమ్ముకొని ఉంది. ఈ పొగమంచు కారణంగానే ఫైలెట్ కు చెట్టు కనిపించలేదని తెలుస్తుంది.

భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్‌ బుధవారం కోయంబత్తూరులోని కూనూర్ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో త్రివిద దళాల అధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ , ఆయన భార్య మధులిక రావత్ సహా మరో 11 మంది మృతి చెందారు. ఈ ఘటనపై దేశం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. బిపిన్ రావత్ మృతి పట్ల సినీ , రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఇక బిపిన్ రావ‌త్ అంత్య‌క్రియ‌లు శుక్ర‌వారం నిర్వహించబోతున్నారు. గురువారం సాయంత్రం బిపిన్ రావ‌త్ పార్థివ దేహాన్ని సైనిక విమానంలో ఢిల్లీకి త‌ర‌లించ‌నున్నారు. శుక్ర‌వారం ఆయ‌న నివాసంలో భౌతిక‌కాయాన్ని ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు సంద‌ర్శ‌న‌కు ఉంచ‌నున్నారు. అనంత‌రం బ్రార్ స్క్వైర్ శ్మ‌శాన వాటిక‌లో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తారు.