నేడు నడ్డా నివాసంలో కేంద్రమంత్రుల సమావేశం

కొనసాగుతున్న రైతుల ఆందోళన..రైతుల సమస్యపై చర్చ

నేడు నడ్డా నివాసంలో కేంద్రమంత్రుల సమావేశం
JP nadda

న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. వాటిని రద్దు చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. ముందస్తు చర్చలపై కేంద్ర ప్రతిపాదనను కూడా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలపై చర్చించేందుకు కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. బిజెపి చీఫ్ నడ్డా నివాసంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నరేంద్రసింగ్ తోమర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై చర్చించినట్టు తెలుస్తోంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/