న్యూజిలాండ్‌ ఘన విజయం

‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఫిలిప్స్‌

Phillips
Phillips

మౌంట్‌ మాంగనీ : వెస్టిండీస్‌తో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ విండీస్‌ బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 46 బంతుల్లోనే సెంచరీ చేయడంతో తొలుత న్యూజి లాండ్‌ 3 వికెట్లకు 238 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

టి20లలో కివీస్‌కిది మూడో అత్యధిక స్కోరు. సమాధానంగా వెస్టిండీస్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 166 పరుగులే చేయడంతో న్యూజిలాండ్‌ 72 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది.

ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్‌ మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో దక్కించుకుంది. ఫిలిప్స్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. మూడో టి20 ఇక్కడే సోమవారం జరుగనుంది.

లక్ష్య ఛేదనలో వెస్టిండీస్‌ ఏ దశలోనూ పోటీతత్వ చూపలేకపోయింది. రెండో ఓవర్లోనే కింగ్‌ డకౌట్‌ అయ్యాడు. ఆపై ఏ ఒక్కరూ దీటైన ప్రదర్శన చేయలేకపోయారు.

మరో ఓపెనర్‌ ఆండ్రీ ఫ్లెచర్‌(20), షిమ్రాన్‌ హెట్మెయిర్‌(25), కీల్‌ మేయర్స్‌(20), కెప్టెన్‌ పొల్లార్డ్‌(28), కీమో పాల్‌(20 నాటౌట్‌), ఫాబియన్‌ అలెన్‌(15) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.

కెప్టెన్‌ పొలార్డ్‌దే ఆ జట్టులో అత్యధిక స్కోరు. కీల్‌ జేమీసన్‌(2/15), మిచెల్‌ శాంట్నర్‌(2/41) రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.
అంతకుముందు టాస్‌ గెలిచిన విండీస్‌ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు గప్తిల్‌, టిమ్‌ సీఫర్ట్‌ న్యూజిలాండ్‌కు శుభారంభం అందించారు.

బౌండరీలు సాధిస్తూ తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించిన తరువాత విడివడ్డారు. తరువాతి ఓవర్లోనే గప్తిల్‌ను ఔట్‌ చేసిన ఆనందం విండీస్‌కు ఎంతోసేపు నిలువలేదు. డెవాన్‌ కాన్వే, గ్లెన్‌ ఫిలిప్స్‌ మూడో వికెట్‌కు 184 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

ఈ నేపథ్యంలో ఫిలిప్స్‌ 46 బంతు ల్లోనే సెంచరీ సాధించాడు. ఇది న్యూజిలాండ్‌ తరఫున టి20లలో అత్యంత వేగవంతమైన సెంచరీ. ఫిలిప్స్‌ చివరి ఓవర్‌ వరకు నిలిచి మరో బంతి ఉండగా అవ్ఞటయ్యాడు. కాన్వే ఆజేయ అర్ధసెంచరీ చేశాడు.

స్కోర్‌బోర్డ్‌ :

న్యూజిలాండ్‌ – గప్తిల్‌ సి పూరన్‌ బి ఫాబియన్‌ అలెన్‌ 34, సీఫర్ట్‌ బి ఒషానె థామస్‌ 18, కాన్వే నాటౌట్‌ 65, గ్లెన్‌ ఫిలిప్స్‌ సి హేడెన్‌ వాల్ష్‌ బి పొల్లార్డ్‌ 108, రాస్‌ టేలర్‌ నాటౌట్‌ 0, ఎక్స్‌ట్రాలు 13, మొత్తం(20 ఓవర్లలో 3 వికెట్లకు)238.
వికెట్ల పతనం : 1-49, 2-53, 3-237.
బౌలింగ్‌ : కాట్రెల్‌ 4-0-39-0; మేయర్స్‌ 1-0-10-0; ఒషానె థామస్‌ 4-0-44-1; కీమో పాల్‌ 4-0-64-0; ఫాబియన్‌ అలెన్‌ 3-0-35-1; కీరన్‌ పొల్లార్డ్‌ 3-0-33-1; రామన్‌ పావెల్‌ 1-0-9-0.

వెస్టిండీస్‌ –

ఆండ్రీ ఫ్లెచర్‌ రనౌట్‌ 20, బ్రాండన్‌ కింగ్‌ బి జేమీసన్‌ 0, షిమ్రాన్‌ హెట్మెయిర్‌ సి శాంట్నర్‌ బి ఇష్‌ సోధి 25, కీల్‌ మేయర్స్‌ సి గ్లెన్‌ ఫిలిప్స్‌ బి నీషమ్‌ 20, నికొలాస్‌ పూరన్‌ సి అండ్‌ బి శాంట్నర్‌ 7, కీరన్‌ పొల్లార్డ్‌ సి సౌథీ బి శాంట్నర్‌ 28, రామన్‌ పావెల్‌ బి లోకీ ఫెర్గూసన్‌ 9, ఫాబియన్‌ అలెన్‌ సి గ్లెన్‌ ఫిలిప్స్‌ బి సౌథీ 15, కీమో పాల్‌ నాటౌట్‌ 26, షెల్డన్‌ కాట్రెల్‌ సి సీఫర్ట్‌ బి జేమీసన్‌ 1, ఒషానె థామస్‌ నాటౌట్‌ 0, ఎక్స్‌ట్రాలు 15, మొత్తం(20 ఓవర్లలో 9 వికెట్లకు)166.

వికెట్ల పతనం : 1-10; 2-28; 3-60; 4-72; 5-107; 6-113; 7-132; 8-140; 9-144.
బౌలింగ్‌ : టిమ్‌ సౌథీ 4-0-49-1; కీల్‌ జేమీసన్‌ 4-0-15-2; లోకీ ఫెర్గూసన్‌ 4-0-22-1; మిచెల్‌ శాంట్నర్‌ 3-0-41-2; ఇస్‌ సోథీ 4-0-26-1; జేమ్స్‌ నీషమ్‌ 1-0-12-1.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/