షర్మిల అరెస్ట్ ఫై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

YSRTP అధినేత్రి వైస్.షర్మిల అరెస్ట్ ఫై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. షర్మిల తన వాహనంలో ఉండగానే వాహనాన్ని క్రేన్ తో లాక్కెళ్లడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాల గొంతునొక్కడమే ప్రధాన అజెండగా టీఆర్ఎస్ పాలన కొనసాగుతోందని విమర్శించారు. ఒక మహిళపట్ల అసభ్యకరమైన రీతిలో టీఆర్ఎస్ నాయకులు , కేసీఆర్ ప్రభుత్వం చూపుతున్న దురహంకారం చాలా అసహ్యకరమైనదన్నారు.

అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం షర్మిల వాహనంపై వరంగల్ జిల్లాలో దాడి జరగడం పట్ల స్పందించారు. ఓ ఆడబిడ్డపై ఈ విధంగా దాడులా? ఇదా సంస్కృతి? అని ప్రశ్నించారు. ఏం… ఓ ఆడబిడ్డ పార్టీ అధ్యక్షురాలిగా ఉండకూడదా? ఆమె యాత్రను అడ్డుకోవడం ఎందుకు? అని జీవన్ రెడ్డి నిలదీశారు. ఒకవేళ ఆమె ఏమైనా విమర్శలు చేసుంటే న్యాయపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలే కాని, దాడులు చేయడం సరికాదని హితవు పలికారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్ర చేస్తుంటే పోలీసులు అనుమతించకపోవడం ఏంటని ప్రశ్నించారు. అధికార పక్షం దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం గర్హనీయం అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.