నేడు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన

cm jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు విశాఖ లో పర్యటించబోతున్నారు. విశాఖ జిల్లా లోని ప్ర‌కృతి వైద్యం తీసుకుంటున్న హ‌ర్యానా రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ తో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ స‌మావేశం కానున్నారు. ఈ భేటీ కోసం, సుమారు రెండు గంటల పర్యటన కోసం ఈ రోజు సీఎం వైఎస్ జ‌గ‌న్ విశాఖ‌కు రానున్నారు.

ఉదయం 10గంటల 25 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 11గంటల 05 నిమిషాలకు విశాఖకు చేరుకుంటారు. అక్కడినుంచి 11గంటల 50 నిమిషాలకు రుషికొండ పెమ వెల్‌నెస్‌ రిసార్ట్‌కు వెళ్తారు. అక్కడ హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో భేటీ అవుతారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1:25 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 2:30 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.