మీ గ్రామంపై మమకారంతోనే గుమ్మడవెల్లి వచ్చాను

ప్రతిపార్లమెంట్‌ సభ్యుడు ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయాలి

kishan reddy
kishan reddy

కందుకూరు: గుమ్మడవెల్లి గ్రామంపై మమకారంతోనే ఢిల్లీలో అనేక పరిణామాలు జరుగుతున్నా గుమ్మడవెల్లి వచ్చానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. తన నియోజకవర్గంలో గ్రామాలు లేనందునే గుమ్మడవెల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నాని కిషన్‌ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడవెల్లిలో ఆయన నేడు పర్యటించారు. అనంతరం మీడియాతో కిషన్‌ రెడ్డి మాట్లాడారు. ప్రతి పార్లమెంట్‌ సభ్యుడు ఒక గ్రామాన్ని ఎంచుకొని అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారని చెప్పారు. దత్తత గ్రామంగా సొంత, అత్తగారి ఊర్లను ఎంపిక చేయొద్దని ప్రధాని చెప్పారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పనిచేస్తారని తెలిసే సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ యోజనలో భాగంగా గుమ్మడ వెల్లి ఎంచుకున్నాని అన్నారు. రానున్న రోజుల్లో పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/