హైదరాబాద్ నగర వాసులకు ఎంఎంటీస్‌ తీపి కబురు

హైదరాబాద్ లో మెట్రో వచ్చిన దగ్గరి నుండి ఎంఎంటీస్‌ ప్రయాణికుల సంఖ్య తగ్గింది. ఇదే సమయంలో కరోనా కారణంగా దక్షిణ మధ్య రైల్వే ఎంఎంటీస్‌ రైళ్లను తగ్గించింది. దీంతో ప్రయాణకులు ఎంఎంటీస్‌ వైపే చూడడం తగ్గించారు. ప్రస్తుతం కరోనా ఉదృతి తగ్గడం..మళ్లీ సాధారణ స్థితి కి రావడం తో దక్షిణ మధ్య రైల్వే ఎంఎంటీస్‌ రైళ్ల పునరుద్ధరణపై కీలక ప్రకటన చేసింది.

నగరంలో మరో 86 ఎంఎంటీస్‌ రైళ్లను నడపనున్నట్టు పేర్కొంది. రైళ్ల రాకపోకల సమయాల్లో పలు మార్పులు చేసినట్టు తెలిపింది. ఉదయం 4.30 నుంచి రాత్రి 12.30 రైళ్లు రాకపోకలు సాగించనున్నామని పేర్కొంది. అంతకుముందు.. ఉదయం 6 నుండి రాత్రి 11.45 వరకు రాకపోకలు ఉండేవి. సీజనల్ టికెట్స్‌ను సైతం సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మళ్ళీ అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. తాజా ప్రకటన తో ఎంఎంటీస్‌ ప్రయాణికుల సంఖ్య పెరగడం ఖాయంగా కనిపిస్తుంది.