భారత పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సంభాషణ

trump- mukesh ambani
trump- mukesh ambani

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రధాని మోడితో ద్వైపాక్షిక చర్చల అనంతరం ఢిల్లీలో భారత పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ..భారత్‌లో అపూర్వమైన స్వాగతం లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. అమెరికాలో రిపబ్లికన్‌లకు స్పష్టమైన మెజారిటీ రావడంతో సంస్కరణలకు అవకాశం చిక్కిందని ట్రంప్ తెలిపారు. అమెరికాలో ఒబామా కేర్‌ను మించి ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాన్ని తీసుకొచ్చామని చెప్పారు. భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందానికి చర్చలు పురోగతిలో ఉన్నాయి. ఒప్పందానికి ముందు కొన్ని చట్టపరమైన ఇబ్బందులను అధిగమించాల్సి ఉంది. ఈ ఒప్పందం ఆరేడు నెలల్లో కార్యరూపం దాల్చుతుంది. అమెరికాలో రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తామన్న విశ్వాసం ఉంది. మేం విజయం సాధిస్తే స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకుంటాయి. సరైన వ్యక్తులను ఎన్నుకుంటేనే ఆర్థిక పురోభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రభుత్వం.. ఉద్యోగాన్ని ఇస్తుంది. కానీ ప్రైవేట్ రంగం ఉద్యోగాలను సృష్టిస్తుంది. తమతో వాణిజ్య యుద్ధాన్ని చైనానే ప్రారభించిందని ట్రంప్ విమర్శించారు. వాళ్లు సుంకాలు పెంచినందుకే తాము పెంచాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. భారత ప్రధాని మోడి ఎంత మంచి వాడో.. అంత ఘటికుడని కొనియాడారు ట్రంప్. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజిండ్ డైరెక్టర్‌తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/