ముగిసిన మాజీ మంత్రి నారాయణ విచారణ

ap-ex-minister-narayana

పరీక్షా పత్రం లీకేజ్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు..మాజీ మంత్రి నారాయణ ను విచారించారు. దాదాపు ఐదు గంటల పాటు అధికారులు నారాయణను విచారించారు. విచారణలో భాగంగా నారాయణ స్టేట్మెంట్ ను సీఐడీ అధికారులు రికార్డ్ చేసారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం నేడు ఉదయం 11.30గంటలకు అధికారులు హైదరాబాద్ లోకి నారాయణ నివాసానికి చేరుకున్నారు.160 సీఆర్పీసీ కింద ఇప్పటికే అధికారులు నోటీసు ఇచ్చారు.

అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ.. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో సీఐడీ విచారణకు హాజరుకాలేడని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. వారి కోరిక మేరకు నారాయణను హైదరాబాద్​లోని ఆయన స్వగృహంలో ప్రశ్నించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తిరిగి మధ్యాహ్నం గంటల నుంచి సాయంత్రం 5 వరకు నారాయణను ప్రశ్నించారు. ఏపీ రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాన్ అవకతవకలపై అధికారుల్ని నారాయణను పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.