తెలంగాణ భవన్ వద్ద భారీగా బందోబస్తు

తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పటు చేసారు. గురువారం బిజెపి ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యల కు నిరసనగా ..ఈరోజు టిఆర్ఎస్ కార్యకర్తలు బంజారాహిల్స్ లోని అరవింద్ ఇంటికి వెళ్లి అక్కడ నానా బీబత్సం చేసారు. ఇంట్లో ఫర్నిచర్ ను ధ్వసం చేసారు. దీనిపై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి.. అరవింద్ ఇంటికి వెళ్లి పరిశీలించారు. అనంతరం అక్కడి నుండి టిఆర్ఎస్ భవన్ ముట్టడికి పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. ఎంపీ ఇంటి నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. బిజెపి శ్రేణులను తెలంగాణ భవన్ లోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.

తాజా పరిణామాల నేపథ్యంలో బంజారాహిల్స్ లోని కవిత ఇంటి వద్ద పోలీసులు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. బీజేపీ కార్యకర్తలు దాడి చేసే అవకాశముండటంతో భారీ సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు. మరోవైపు అర్వింద్ ఇంటిపై దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు.