పేదలకు ఇళ్ల పేరిట వేల కోట్ల అవినీతి చేశారుః బోండా ఉమా

bonda umamaheswara rao
bonda-uma-fires-on-jagan

అమరావతిః పేదల ఇల్ల నిర్మాణాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి గాలికి వదిలేసారని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. టిడిపి హయాంలో పేదల కోసం నిర్మించిన 3.13 లక్షల ఇళ్లను వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం శిథిలావస్థకు తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల పేరిట వేల కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు. పేదల సొంతింటి కలను టిడిపి చేసి చూపిస్తే, వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కలగానే మిగిల్చింది.

2019లో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఉంటే.. 3.13 లక్షల టిడ్కో ఇళ్ళతో పాటు ప్రతి పేదవాడికి సొంతిల్లు దక్కేది. టిడిపి ప్రభుత్వం 90% వరకు పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డిని ప్రజలంతా ద్వేషిస్తున్నారు. వైఎస్‌ఆర్‌సిపి రంగులేసుకున్న టిడ్కో ఇళ్లకు చెదలు పడుతున్నా, ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. సెంటు పట్టా పేరుతో వైఎస్‌ఆర్‌సిపి దోచుకున్న ₹7వేల కోట్ల వివరాలు ఇప్పటికే ఆధారాలతో బయటపెట్టాం అని బొండా ఉమ తెలిపారు.