వెయ్యి ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల వ‌రి సేక‌ర‌ణ

ఈ ఏడాది నుంచి అందుబాటులోకి 5జీ సేవలు.. మారుమూల ప్రాంతాలకు ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌


న్యూఢిల్లీ: కేంద్ర బ‌డ్జెట్ లో ప‌లు అంశాలు – ప్ర‌ధాని గ‌తిశ‌క్తియోజ‌న‌, స‌మీకృత అభివృద్ధి, అభివృద్ధి ఆధారిత పెట్టుబ‌డులు, ప‌రిశ్ర‌మ‌ల‌కు ఆర్థిక ప్రోత్సాహ‌కాలు. జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కి రూ.60వేల కోట్లు. 75జిల్లాల్లో 75డిజిట‌ల్ బ్యాంకింగ్ యూనిట్లు, ఎల‌క్రిక్ట్ వాహ‌నాలుగా మార్చ‌డానికి ప్రోత్సాహ‌కాలు. PMAYద్వారా రూ. 80ల‌క్ష‌ల నిర్మాణం. ఐఐటీల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు..క్రెడిట్ గ్యారంటీ ప‌థ‌కానికి రూ.2ల‌క్ష‌ల కోట్లు..ఎక్స్ ప్రెస్ వే కోసం గ‌తిశ‌క్తి మాస్ట‌ర్ ప్లాన్..క‌వ‌చ్ కింద 2వేల కిలోమీట‌ర్ల రోడ్ల నిర్మాణం..త్వ‌ర‌లో డిజిట‌ల్ చిప్ ల‌తో కూడిన ఈ పాస్ పోర్టులు జారీ..వంద‌శాతం పోస్టాఫీస్ లో బ్యాంకింగ్ సేవ‌లు.. ఒక‌టిన్న‌ర ల‌క్ష‌ల పోస్టాఫీసులు బ్యాంకింగ్ కు అనుసంధానం కానున్నాయి. పీఎం ఆవాస్ యోజ‌న కింద 18ల‌క్ష‌ల ఇళ్లు..ఈ ఇళ్ల‌కోసం 48వేల కోట్లు కేటాయింపు..ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.1500కోట్లు..వెయ్యి ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల వ‌రిని సేక‌రిస్తామ‌ని నిర్మ‌లాసీతారామ‌న్ తెలిపారు. ప్ర‌స్తుతం 12గా ఉన్న విద్యాటీవీ చానెళ్ళు 200కి పెంపు.


దేశవ్యాప్తంగా ఈ ఏడాది 5జీ సాంకేతికత అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. 2022-23లో ప్రైవేటు సంస్థల ద్వారా 5జీ సాంకేతికత ప్రవేశపెడుతున్నామని చెప్పారు. 2022-23లో భారత్‌ నెట్‌ ప్రాజెక్టు ద్వారా పీపీపీ పద్ధతిలో మారుమూల ప్రాంతాలకు కూడా ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ విస్తరిస్తామని పేర్కొన్నారు. నగరాలు, పట్టణాల అభివృద్ధికి నూతన పట్టణ ప్రణాళిక, నగరాల్లో ప్రయాణ సౌకర్యాల అభివృద్ధిపట్టణాలు, నగరాల్లో నిర్మాణరంగంలో సంస్కరణలు, పట్టణ ప్రణాళిక అభివృద్ధికి ప్రత్యేక కోర్సులు, సిలబస్‌ తీసుకొస్తామని వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/