విరూపాక్ష సెన్సార్ టాక్

సాయి ధరమ్ తేజ్ – సంయుక్త జంటగా కార్తీక వర్మ దండు డైరెక్షన్లో సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం విరూపాక్ష . ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో మేకర్స్ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసారు. సినిమాను చూసిన సెన్సార్ బోర్డు (CBFC) A సర్టిఫికెట్ (A Certificate) జారీ చేసారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తెగ ఆశ్చర్య పోతున్నారు. ఇటీవలే రవితేజ యొక్క రావణాసురా సినిమాకి కూడా ఏ సర్టిఫికేట్ లభించింది. అయితే చాలా అరుదుగా తెలుగు సినిమాలకు ఏ సర్టిఫికెట్ వస్తుంది. అందుకే అబిమానులు ఆశ్చర్యపోతున్నారు.

కాంతార ఫేం అంజనీశ్‌ లోక్‌నాథ్‌ విరూపాక్ష చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజ‌య్‌, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్సిడెంట్‌లో గాయపడి కోలుకున్న తర్వాత సాయిధరమ్ నుంచి వస్తున్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లోనూ అంచనాలున్నాయి. అలాగే తన కెరీర్‌కు కూడా సాలిడ్ హిట్ పడాల్సిన అవసరముంది. మరోవైపు తేజ్ సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతమ్‌ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ ఓ కీలక రోల్ చేస్తుండడం విశేషం. జులై 28 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.